Friday, May 17, 2024

TSPSC | టీపీబీవో పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. అభ్యంత‌రాల‌కు 15 వ‌ర‌కు చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ (టీపీబీవో) పరీక్ష రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలుంటే గురువారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను అభ్యర్థులు పంపించాలని తెలిపారు. పరీక్ష రెస్పాన్స్‌ షీట్లు మాత్రం ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 8న టీపీబీవో రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement