Tuesday, April 30, 2024

TS Study | 16న ఉచిత సివిల్స్‌ శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 16న ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ బుధవారం ఈ విష‌యాన్ని తెలిపారు. సివిల్స్‌ ఉచిత కోచింగ్‌కు మొత్తం 150 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement