Sunday, April 28, 2024

IPL | రెండు జ‌ట్ల‌కు ట‌ఫ్ ఫైట్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ ముంబై

ఐపీఎల్ 16వ సీజ‌న్ 63వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆడ‌నున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారిన నేపథ్యంలో రెండు జ‌ట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీల‌కం కానుంది. దీంతో.. హోరాహోరీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. సొంత గ్రౌండ్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓట‌మిని చ‌విచూసిన ల‌క్నో.. ఇవ్వాల‌ పంజా విస‌రాల‌ని భావిస్తోంది. కాగా,ఇవ్వాల్టి మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

ఇక‌.. రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న రోహిత్ సేన హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తోంది. ముంబై ప్లేయ‌ర్స్ ఇషాన్ కిష‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్, నేహ‌ల్ వ‌ధేర దంచి కొడుతున్నారు. ల‌క్నో ఓపెన‌ర్లు డికాక్, మేయ‌ర్స్, స్టోయినిస్, పూర‌న్ కూడా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముంద‌డుగు వేస్తుంది. మ‌రి.. ఈ కీల‌క పోరులో గెలిచిది ఎవ‌రో? మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement