Thursday, May 2, 2024

Today’s Editorial – విప‌క్షాల ఐక్య‌త … భిన్న స్వ‌రాలు…

వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకోసం జనతాదళ్‌ (యు) నాయకుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ చాలా రోజులపాటు కసరత్తు చేసి శుక్రవారం పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రతి పక్షాల సమావేశానికి ఆదిలోనే విఘ్నాలు ఎదురవుతు న్నాయి. ఢిల్లి ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ప్రతిపక్షాలకు రాసిన లేఖలో ఢిల్లి పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ని ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా చర్చించాలని షరతు పెట్టారు. గురువారం మరో అడుగు ముందుకేసి ఈ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లిd పాలనా యంత్రాంగానికి కొత్త రూపు ఇవ్వడం కోసమని చెప్పి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ పై అన్ని పార్టీలు ఈ సమావేశంలో తమ వైఖరిని స్పష్టం చేయాలన్నది ఆయన డిమాండ్‌. మరోవైపు ఈ సమావే శానికి తాను హాజరు కావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ఆమె కూడా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులపై, మహిళలపై దాడుల విషయంలో కాంగ్రెస్‌ తన వై ఖ రిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విషయం లో కాంగ్రెస్‌, బీజేపీలది ఒకే వైఖరిలా కనిపిస్తోందన్నది ఆమె సందేహం. పాట్నాలో శుక్రవారం జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నాయకులు చేతులు కలపడానికే కానీ, మనసులను కలుపుకోవడానికి కాదన్న వ్యాఖ్యను తీసిపారేయలేం. ఆమె వైఖరే అందుకు అద్దం పడుతోం ది. వివిధ అంశాలపై ప్రతిపక్ష నాయకులు అరమరికలు లేకుండా చర్చించినప్పుడే ఈ సమావేశం ఏర్పాటు ఉద్దేశ్యం ఫలవంతం కాగలదని ఆమె అన్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్‌ కానీ, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ప్రతిపా దించిన సమాతావాదాన్నీ, సామరస్య భావాన్ని వ్యాపిం పజేయడానికి కృషి చేయడం లేదని ఆమె ఆరోపించారు. ప్రతిపక్షాల్లో రాజకీయంగా వివిధ అంశాలపై వైరుధ్యా లున్నప్పటికీ, నిరుద్యోగం, అవినీతి, ధరల పెరుగుదల, కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం దాసోహం కావడం వంటి అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక ఉమ్మడి అజెండాను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంద న్న విషయంపై అందరూ ఏకీభవిస్తున్నారు.

ఇక ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలకు గండి కొట్టేందుకు బీజేపీ పలువిధాల ప్రయత్నిస్తోంది. యూపీఏ హయాంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నిజానికి దేశంలో గడిచిన పదేళ్ళలో నిరుద్యో గం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామన్న వాగ్దానాన్ని అమలు జరపడంలో ఆనాడు యూపీఏ విఫలమై న ట్టే ఇప్పుడు బీజేపీ విఫలమైంది. ప్రజల కనీసావసార లను తీర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. విపక్షా ల ఐక్యతా యత్నాలు కేవలం అధికారం పంచుకోవ డానికి మాత్రమే తప్ప, ఉమ్మడి అజెండాను అమలు జరపడానికి కాదని రుజువు అవుతోంది. స్విస్‌ బ్యాంకు ల్లో నల్లధనాన్ని వెలికితీసి తెస్తానన్న వాగ్దానాన్ని ఈ రెండు కూటమి ప్రభుత్వాలు అమలు జరపలేకపోయా యి. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం ఆశ్రిత పెట్టు బడిదారీ విధానాన్ని అమలు జేస్తున్నాయి.

- Advertisement -

అమెరికాతో సంబంధాల విషయంలో ఒకరికంటే మరొకరు ఎక్కువ న్న రీతిలో వ్యవరిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్‌ కు ఉన్న ప్రతిష్ట మసకబారుతోంది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ద్వారా ఆశించిన ప్రయోజనాలను సాధించలేకోయాయి. ప్రస్తుత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ప్రశ్నించే ప్రతిప క్షాలపై కేసులు పెట్టేందు కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ), సీబీఐలను ఉసిగొ ల్పుతున్నాయి. యూపీఏ హయాంలో కూడా ఈ ధోరణి ఉంది కానీ, ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నింటిపైనా ఏదో రకమైన కేసులు నమోదు అవుతున్నాయి. పాట్నాలో విపక్షాల ఐక్యతా సమావేశానికి ప్రధాన ప్రేరణ ఇదే. ప్రతిపక్షాల ఐక్యతను సాధించడం అంత సులభం కాద న్న విషయం ఈ పార్టీల్లో మెజారిటీ పార్టీలకు తెలుసు.

అంతేకాక, ప్రతిపక్షాల ఐక్యతకు నాయకత్వ సమస్య కూడా అడ్డంకిగా మారవచ్చు. ఆ విషయాన్నిమరుగు పర్చి ఈ సమావేశానికి గైర్‌హాజర్‌ అయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు. అయితే, కేజ్రీవాల్‌ లేవనెత్తిన అంశం చాలా తీవ్రమైనది. ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీయ డానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆయన ఆరోపణను తోసిపుచ్చలేం. మిగిలిన అంశాలతో పాటు దానిని చర్చిస్తే తప్పు లేదు. అదే ప్రధానఅంశమంటే అందరూ అంగీకరించకపోవచ్చు. కానీ పాట్నా సమావే శం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కేజ్రీవాల్‌ అంతగా పట్టుబడుతున్నప్పుడు ఈ అంశం చర్చిస్తే తప్పు లేదేమో! ఈ సమస్య ఢిల్లిdకే పరిమితం కాదన్న కేజ్రీవాల్‌ మాటల్లో అసత్యం లేదు. ఇది చట్టరూపం ధరిస్తే అన్ని రాష్ట్రాలపై కత్తి వేలాడుతుందన్న అనుమానాలు నిరాధా రం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement