Saturday, November 9, 2024

నేటి మ‌ధ్యాహ్నం రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌ల మీడియా స‌మావేశం…

హైద‌రాబాద్ – ఇటీవల తల్లిదండ్రులైన మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన దంపతులు ఈ మధ్యాహ్నం మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచరణ్ దంపతులు అపోలో ఆసుపత్రి వద్దనున్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇదే సంద‌ర్భంగా మీడియా సమావేశంలో పాప ఫొటోలు విడుదల చేయ‌నున్నారు.. ఈ మీడియా స‌మావేశానికి చిరంజీవి దంప‌తులు కూడా హాజ‌రుకావ‌చ్చ‌ని స‌మాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement