Sunday, May 5, 2024

స్టూడెంట్స్‌కు స్ఫూర్తినింపేలా.. ఉస్మానియాలో జైభీం ప్ర‌ద‌ర్శ‌న‌..

జైభీం సినిమా ఎంతలా ఆదరణ పొందిందో, వ్యవస్థపై జనాలను ఎంతలా ఆలోచింపచేసిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాను విద్యార్థుల కోసం ప్రదర్శించబోతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం జైభీం సినిమాను ఈనెల 28 నాడు ఠాగూర్‌ ఆడిటోరియంలో ప్రదర్శించాలని అధికారులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు స్ఫూర్తి చంద్రూ అనే ఓ లాయర్‌. 90వ దశకంలో తమిళనాడులో జరిగిన ఒక గిరిజన యువకుడి లాకప్‌ డెత్‌తో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి చలించిపోయిన చంద్రూ.. వాళ్ల తరుపున నిలబడి తన న్యాయపోరాటాన్ని చేశారు.

ఎన్నో అవాంతరాలను, సవాళ్లను ఎదుర్కొని గిరిజనుల కుటుంబానికి ఎలా న్యాయం చేశాడనేదే ఈ సినిమా కథాంశం. అయితే ఈ సినిమా ఎంతో మందిని ఆలోచింపజేసింది. ఉస్మానియావర్సిటీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నట్లు ఉన్నత విద్యామండలిలో ఆయనను కలిసిన విలేకరులతో వర్సిటీ వీసీ రవీందర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement