Friday, May 3, 2024

Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అంగప్రదక్షిణం, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం పది గంటలకు, అదేవిధంగా డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీ డిప్ లో అక్టోబరు 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి అందుబాటులో ఉంచనున్నారు.

అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు…
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు దాదాపు 12 గంటలు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజుల్లో శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను కూడా టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement