Monday, June 5, 2023

ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ముగ్గురు మృతి.. మృతులంతా వనపర్తి వాసులే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వనపర్తికి చెందిన వలస కూలీలు రాజప్ప, శ్రీను, కృష్ణగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మూల మలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరించారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement