Saturday, May 4, 2024

బొమ్మ పిస్ట‌ల్స్‌తో బెదిరింపులు.. అయిదుగురు మాజీ మావోయిస్టుల అరెస్ట్‌

ప్రభన్యూస్‌ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ కాళేశ్వరం సర్పంచ్‌ భర్త వెన్నపురెడ్డి మోహన్‌ రెడ్డికి మావోయిస్టులమంటూ రూ.50 లక్షలు, భూపాలపల్లి మండలం నాగారం సర్పంచ్‌ పిన్‌ రెడ్డి రాజిరెడ్డిని రూ.5లక్షలు డిమాండ్‌ చేసి బెదిరింపులకు గురిచేసిన ఐదుగురు మాజీమావోయిస్టులను కాళేశ్వరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న కాళేశ్వరం సర్పంచ్‌ ఇంటికి ముగ్గురు మాజీ మావోయిస్టులు వెళ్ళి రెండు బొమ్మ తుపాకులు, ఒక లెటర్‌ హెడ్‌ చూపించి రూ.50లక్షలు మావోల పార్టీకి విరాళంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వెళ్ళిపోయారు. వారిలో మహాదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన వావిళ్ళ జనార్ధన్‌ ప్రస్తుతం ఆర్‌ఎంపీగా భూపాలపల్లి కారల్‌మార్క్స్‌ కాలనీలో పనిచేస్తున్నాడు. ఆజంనగర్‌కు చెందిన పులిగంటి సతీష్‌ , బీరెల్లి నర్సయ్య మాజీలు,ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన పెండెం రాజేంద్రప్రసాద్‌ ,కాల్వపల్లికి చెందిన అల్లెం సమ్మయ్య ఐదుగురు కలిసి భూపాలపల్లి లో జనార్ధన్‌ ఇంట్లో సమావవేశ##మై అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మావోయిస్ట్‌ టార్గెట్‌ పర్సన్‌ కాళేశ్వరం సర్పంచ్‌ భర్త వెన్నపు రెడ్డి మోహన్‌ రెడ్డిని , భూపాలపల్లి మండలం నాగారం సర్పంచ్‌ పిన్‌ రెడ్డి రాజిరెడ్డిని ఇద్దరిని వారి వద్ద ఉన్న బొమ్మతుపాకి, మావోయిస్ట్‌ లెటర్‌ చూపించి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్‌ వేసుకున్నారు.

మావోయిస్ట్‌ పేరుతో లెటర్‌ లో నీవు ఇదివరకే టార్గెట్‌గా ఉన్నావని పేరు తొలగించాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఇవ్వకపోతే చంపుతామని జనార్ధన్‌ వ్రాసాడు. ఏప్రిల్‌ 24న జనార్ధన్‌, బీరెల్లి నర్సయ్య, పులిగంటి సతీష్‌ లు కలిసి కారులో కాలేశ్వరం వచ్చి సర్పంచ్‌ ఇంటిని రెక్కి చేసుకుని అక్కడి నుండి భూపాలపల్లి మండలం నాగారం సర్పంచ్‌ పిన్‌రెడ్డి రాజిరెడ్డి ఇంటిని రెక్కి చేసి తిరిగి భూపాలపల్లికి చేరుకున్నారు. ఏప్రిల్‌ 26న ఈ ముఠా కాలేశ్వరం వెళ్ళి మోహన్‌ రెడ్డికి బొమ్మతుపాకి ,లెటర్‌ చూపించి 50 లక్షలు ఇవ్వాలని రెండు రోజుల సమయం ఇచ్చారు. అదే విధంగా రాజేంద్ర ప్రసాద్‌, సమ్మయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డికి రూ.5లక్షలు కావాలని బెదిరించి అక్కడి నుండి జనార్దన్‌తో కలిసి కారులో భూపాలపల్లికి వెళుతారు.

ఏప్రిల్‌ 27న నాగారం సర్పంచ్‌కు ఫోన్‌ చేసి డబ్బులు తీసుకుని కొనంపేట ఎక్స్‌రోడ్‌ కు రావాలని చెప్పడంతో రాజిరెడ్డి రాకపోవడంతో అక్కడినుండి వెళ్ళిపోతారు. అదే విధంగా శనివారం ఉదయం కాళేశ్వరం వెళ్ళి మోహన్‌ రెడ్డిని కలిసి డబ్బులు వసూలు చేయాలని వెళ్తున్న క్రమంలో పోలీసుల తనిఖీల్లో ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 బోమ్మ పిస్టల్స్‌, మారుతి సుజికి స్విప్ట్‌ డిజైర్‌ కారు, 4 జిలిటెన్‌స్టిక్స్‌, 5 మొబైల్స్‌ , 1 పల్సర్‌ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సురేందర్‌ రెడ్డి తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మహాదేవపూర్‌ సీఐ టి. కిరణ్‌, కాళేశ్వరం ఎసై#్స లక్ష్మణ్‌రావు, ఎసై#్స భవాని సేన్‌, హెచ్‌సీ రాజేందర్‌, కానిస్టేబుల్స్‌ బాల్‌ సింగ్‌, తిరుపతి, కిరణ్‌, శ్యామ్‌, మధు, అన్వేష్‌, రాజశేఖర్‌, ధనుంజయ, ఐటి కోర్‌ టీమ్‌ వేణులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కాటారం డీఎస్పీ రామ్‌మోహన్‌రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ రాములు, మహాదేవపూర్‌ సీఐ టి. కిరణ్‌, కాళేశ్వరం ఎసై#్స లక్ష్మణ్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement