Friday, April 26, 2024

ధోనీ మెమ‌ర‌బుల్ ఇన్సింగ్స్‌.. స్పెష‌ల్ వీడియోను షేర్ చేసిన ఐసీసీ !

MS ధోని 2020 ఆగ‌స్టు 15న‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా.. అతని అద్భుతమైన కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇవ్వాల (సోమవారం) త‌మ అఫీషియ‌ల్ సోష‌ల్ మీడియా ఎకౌంట్ లో ఒక వీడియోను పోస్ట్ చేసి ధోనీకి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇక‌.. ICC అధికారికంగా పోస్ట్ చేసిన 3:11 సెకన్ల వీడియో క్లిప్ ఇప్పుడు సెన్సేష‌న్ అవుతోంది.

అంతర్జాతీయ మైదానంలో ధోనికి సంబంధించిన‌ కొన్ని మ‌ధుర‌ క్షణాలను ఈ వీడియోలో పొందుప‌రిచారు. 2007, 2011 ప్రపంచ కప్ తో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీతో సహా ICC ఈవెంట్‌లలో భారతదేశం సాధించిన విజయాలెన్నో ఇందులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియోలో మిలియ‌న్ల‌ వ్యూస్‌తో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. చాలామంది ‘మిస్సింగ్ యూ ధోనీ’ అనే కామెంట్స్‌తో ఇన్‌బాక్స్‌ని నింపేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement