Monday, May 13, 2024

బార్ల లైసెన్స్‌లకు మొదలైన ఈ-వేళం.. దరఖాస్తుల రూపంలో రాష్ట్ర‌ ఖజానాకు రూ.91 కోట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మూడేళ్ల కాలపరిమితి(2022-25)కి బార్ల లైసెన్స్‌ల కోసం ఈ నెల 21న ఆబ్కారీశాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 840 బార్లకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆబ్కారీ శాఖ తదుపరి రెండు బార్లను తగ్గించి 838 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా దరఖాస్తులు చేసుకునేందుకు 27వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించగా 1670 మంది బార్ల లైసెన్స్‌ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి దరఖాస్తు రుసుము చెల్లించేందుకు గురువారం సాయంత్రం వరకు అవకాశం ఇవ్వగా 1158 మంది మాత్రమే చెల్లించారు. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో ఆబ్కారీ శాఖకు రూ.91 కోట్లు వచ్చాయి.

ఈ రోజు రేపు (శని-ఆదివారాల్లో) ఈ-వేలం విధానంలో బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తారు. ఈ రోజు (శ‌నివారం) శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, విశాఖపట్టణం, అనకాపల్లి, విజయనగరం, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఈ-వేలం నిర్వహిస్తారు. రేపు (ఆదివారం) కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్‌టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement