Thursday, May 2, 2024

Third Phase – మూడో విడ‌త ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ రిలీజ్

నేటి నుంచి నామినేష‌న్లు స్వీక‌ర‌ణ‌
ఈనెల 19 వరకు నామినేషన్లకు అవకాశం
12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో ఎన్నిక‌లు
ఆయా రాష్ట్రాల‌లో మే 7న పోలింగ్‌

న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ రావ‌డంతో ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ‌మైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్‌ ఉంటుంది.

ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్‌బందర్‌ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశ్చిమ‌ బెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్‌ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement