Saturday, April 27, 2024

TS | ప‌దేళ్లు పార్టీని వాడుకున్నారు… ఇప్పుడొదిలేశారు.. కెటిఆర్

హైద‌రాబాద్ : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశార‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ళ్లీ రేపు వ‌చ్చి ఇదే రంజిత్ రెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నా పార్టీలోకి రానివ్వం. వాళ్ల‌కుండా త‌ప్ప‌కుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని స్పందించారు.

పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని అన్నారు. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా అన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇచ్చిన కేటీఆర్ అన్నారు. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు.

2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం… 2019లో రంజిత్ రెడ్డి మాధురి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని తెలిపారు. కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం కే విసిరిన సవాలు రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు…

ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. రైతులకు రుణమాఫీ, 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కిన్రు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి.. రాష్ట్రంలో ఏవర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలని డిమాండ్ చేశారు. రేవంత్ 5 ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు… నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులు అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారు.

- Advertisement -

కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్ గా మారిండని అన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ కోసం పనిచేస్తున్నారా… లేదా మోడీ కోసమా చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు… బిజెపిని అపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బిజెపికి లాభం అవుతుందన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అని తెలిపారు.

ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ బలోపేతం చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో బిసిలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 13 తేదిన జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలిరావాలని పిలుపు నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement