Saturday, December 7, 2024

న‌న్ను ఆ ప‌నిచేయాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నారు.. రిసార్ట్ ఘ‌ట‌న‌లో హ‌త్య‌కు గురైన యువతి వాయిస్ మెస్సేజ్‌!

ఉత్తరాఖండ్ లో 19 ఏళ్ల రిసెప్షనిస్టు అదృశ్యం అయ్యింది.. ఆ త‌ర్వాత ఆమె డెడ్‌బాడీ దొరికింది. దీన్ని హ‌త్య‌గా గుర్తించి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో బీజేపీ సీనియర్ లీడ‌ర్ కొడుకు పులకిత్ ఆర్యా ప్రధాన నిందితుడిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. బీజేపీ నేత తనయుడితో పాటు ఆ టీనేజి అమ్మాయి పనిచేస్తున్న రిసార్టు మేనేజర్ సౌరభ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, ఆ యువతి తన ఫ్రెండ్ కు పంపిన ఓ వాట్సాప్ మెస్సేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తనను రేప్ చేయాల‌ని చూస్తున్నార‌ని, ప్రాసిట్యూట్‌గా మార్చేందుకు రిసార్ట్ వాళ్లు యత్నిస్తున్నారని ఆమె ఆ మెస్సేజుల్లో పేర్కొంది. రూ.10 వేలు చెల్లించిన కస్టమర్లకు ఆ ప‌నుల‌తో ‘ప్రత్యేక సేవలు’ అందించాలని రిసార్ట్ యాజమాన్యం తనను ఒత్తిడి చేస్తోందని వెల్ల‌డించింది.

అంతేకాకుండా.. రిసార్ట్ లో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, అయితే, అతను ఫుల్‌గా తాగి ఉన్నందున ఆ విషయాన్ని పెద్ద‌గా పట్టించుకోవద్దని రిసార్ట్ యాజమాన్యం చెప్పిందని కూడా ఆమె తన మెస్సేజ్‌లో వివరించింది. ఇక‌.. రిసార్ట్ లోని ఓ ఉద్యోగికి ఆమె చేసిన వాయిస్ కాల్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. తన బాధలను ఆమె ఏడుస్తూ వివరించినట్టు ఆ కాల్ ద్వారా వెల్ల‌డ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement