Sunday, April 28, 2024

వార‌సుడులో విజ‌య్ కోసం పాట పాడిన.. హీరో శింబు

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తోన్న తెలుగు చిత్రం వార‌సుడు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌ ఈ సినిమాను వ్యతిరేకించినా.. సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తామని మరోసారి దిల్ రాజు టీం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను రిలీజ్‌ చేశారు. The Thalapathy అంటూ సాగే ఈ పాటను హీరో శింబు పాడారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement