Friday, May 3, 2024

Big Story : ప్రపంచ జనాభా 800 కోట్లు.. పాతికేళ్లలో 200 కోట్లు పెరుగుదల

నేటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. 2022 ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం, వచ్చే ఏడాది అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అగ్రస్థానానికి చేరుకోబోతున్నది. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న చైనా రెండవ స్థానానికి పడిపోతుంది అని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సరికొత్త మైలురాయిని చేరుతుంది. నవంబర్‌ 15న భూమిపై జనాభా సంఖ్య 800 కోట్లకు చేరుకుంది. జనాభా 600-700 కోట్లకు చేరడానికి 12 ఏళ్లు పట్టగా, 700-800 కోట్లకు చేరడానికి ఇంచుమించు ఇదే వ్యవధి పట్టిందని నివేదిక స్పష్టంచేసింది.

మన వైవిధ్యానికి, ఉమ్మడి మానవత్వానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గింపు దిశగా ఆరోగ్య సంరక్షణలో విజయానికి ఇది వేడుకగా నిలుస్తున్న సందర్భం అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు. అదే సమయంలో మన గ్రహం పట్ల భాగస్వామ్య బాధ్యతను గుర్తుచేసుకునే క్షణం. ఒకరికొకరం మన కట్టుబాట్లను ఎక్కడ కోల్పోతున్నామో ప్రతిబింబించే సందర్భమని నొక్కిచెప్పారు.

ఐరాస నివేదికలోని కీలకాంశాలు..

  • జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉన్నది. 2023లో జనాభా పరంగా చైనాను భారత్‌ అధిగమిస్తుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది.
  • 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు, 2080 నాటికి 1000 కోట్లకు చేరుతుంది. 2100 వరకు అదే స్థాయిలో కొనసాగొచ్చు.
  • ఈ అంచనాలో సగానికిపైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లోనే (భారత్‌, పాకిస్థాన్‌, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్‌, టాంజానియా) నమోదవుతుంది.
  • 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60 కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉన్నది. మిగిలిన 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నది.
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పనిచేసే జనాభా (25- 64 ఏళ్ల వారు) క్రమంగా పెరుగుతున్నది.
  • స్త్రీకి జీవితకాల సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గింది.
  • ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయు:ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది.
  • 2050 నాటికి సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలకు చేరుతుంది.
  • 2021లో తక్కువ అభివృద్ధి చెందిన దేశాల ఆయుర్ధాయం ప్రపంచ సగటు కంటే 7 ఏళ్లు తక్కువ.
  • ప్రపంచ జనాభాలో బంగ్లాదేశ్‌ వాటా 2.2శాతంగా ఉంది. జనాభా పరంగా 8వ అతిపెద్ద దేశం. ప్రస్తుతం 17కోట్లుగా ఉన్న జనాభా 2050 నాటికి 20.4కోట్లకు చేరుతుంది.
  • 65 ఏళ్లు పైబడిన జనాభా ప్రస్తుతం 10శాతంగా ఉంది. 2050 నాటికి ఇది16శాతానికి పెరుగుతుంది. అంటే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సంఖ్య ఐదేళ్ల పిల్లలకు రెట్టింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement