Friday, April 26, 2024

బ్యాగ్ పోగొట్టుకున్న మ‌హిళ‌.. నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ హోంగార్డ్

వ‌రంగ‌ల్ : ఖిలా వరంగల్‌కు చెందిన కొమ్ము సరిత ఇవ్వాల (సోమ‌వారం) మధ్యాహ్నం తన బ్యాగ్ ని వ‌రంగ‌ల్‌లోని బట్టలబజార్ లో పోగొట్టుకుంది. అక్కడే డ్యూటీలో ఉన్న‌ హోంగార్డ్ మోహిన్ కు ఆ బ్యాగ్ దొరికింది. కాగా, ఆ బ్యాగ్ ఎవరిదనే విచారణ చేప‌ట్టారు. ఆ త‌ర్వాత బాధితురాలి ఆచూకి తెలుసుకున్నారు.

దీంతో వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్‌ బాబులాల్ బాధిత‌ మహిళను పోలీస్ స్టేషన్ కి పిలిపించి బ్యాగ్, ఆ బ్యాగ్ లో ఉన్న 7500/- రూపాయలు, మెట్టలు, ఆధార్ కార్డును అందించారు. ఈ క్ర‌మంలో నిజాయితీని చాటుకున్న హోంగార్డ్ మోహ‌న్‌ని ఇన్‌స్పెక్ట‌ర్ బాబులాల్‌ అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement