Thursday, April 25, 2024

చెన్నైలో ది వారియ‌ర్ త‌మిళ వెర్ష‌న్ – ప్రీ రిలీజ్ ఈవెంట్

ది వారియ‌ర్ చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్..కృతిశెట్టి జంట‌గా న‌టించ‌నున్నారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.. ది వారియ‌ర్ త‌మిళ వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నేడు సాయంత్రం 6:30 గంట‌ల‌కు ఐకానిక్ స‌త్యం సినిమాస్‌లో ప్లాన్ చేశారు. ఈవెంట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి 28 మంది సెల‌బ్రిటీలు ముఖ్యఅతిథులుగా వ‌స్తుండ‌టం విశేషం. డైరెక్ట‌ర్లు మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, విట్రిమార‌న్, భార‌తీరాజా, గౌత‌మ్ మీన‌న్, ఎస్‌జే సూర్య‌, భార‌తీరాజా, లోకేశ్ క‌న‌గ‌రాజ్, హెచ్ వినోథ్‌, శ‌శి, కార్తీక్ సుబ్బ‌రాజు, పీఎస్ మిత్ర‌న్‌, విక్ర‌మ్ ఫ్రభు, శివ‌, పార్థీబ‌న్‌తోపాటు కార్తీ, విశాల్‌, కీర్తిసురేశ్‌తోపాటు ప‌లువురు నటీన‌టులు చీఫ్ గెస్టులుగా రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement