Wednesday, May 15, 2024

ది వారియ‌ర్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ కి గెస్ట్ గా- ద‌ర్శ‌కుడు బోయ‌పాటి

ది వారియ‌ర్ చిత్రం ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ కి గెస్ట్ గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి హాజ‌రుకానున్నారు.హీరో రామ్ మరోసారి మాస్ యాక్షన్ కంటెంట్ తో రావడానికి రెడీ అవుతున్నారు. . శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించారు. తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించనున్నారు. బోయపాటి ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ వేదికపై రాత్రి 7:57 నిమిషాలకు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అదే సమయంలో తమిళ ట్రైలర్ ను హీరో శివకార్తికేయన్ డిజిటల్ లాంచ్ చేయనున్నాడు. ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నదియా .. అక్షరగౌడ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement