Friday, May 17, 2024

స‌ర్కారువారి పాట‌.. క‌ళావ‌తి సాంగ్ ప్రోమో రిలీజ్‌.. దుమ్ము దులుపుతున్న ప్రిన్స్..

మహేష్ బాబు, కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాని మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్ కళావతి ప్రోమో రిలీజ్ చేసింది చిత్రం యూనిట్.. ఇందులో ప్రిన్స్ మహేష్, కీర్తి సురేష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ఒక రొమాంటిక్ జోడీగా క‌నిపిస్తున్నారు. సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు వైట్ ష‌ర్ట్ తో హాండ్సంగా కనిపిస్తుంన్నాడు, కీర్తి సురేష్ చీర క‌ట్టులో వీక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేస్తోంది. నేషనల్ అవార్డ్ న‌టి అయిన కీర్తి సురేశ్ మహేష్ బాబుతో మొదటిసారి స్రీన్ షేర్ చేసుకుంటుండంతో అభిమానులు ఈ కొత్త జంట కెమిస్ట్రీ ఎలా ఉండ‌బోతుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట GMB ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఎస్ ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. చిరంజీవి, రామ్ చరణల‌ ఆచార్యతో బాక్సాఫీస్ వద్ద ఢీకొన‌బోతున్న‌ ఈ చిత్రం మే 12 న థియేటర్లలోకి రానున్న‌ట్టు తెలుస్తోంది.

https://youtube.com/watch?v=bwrBhrXfKbs

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement