Monday, April 29, 2024

తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరువలేనిది – గంగుల

కరీంనగర్ – తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరువలేనిదని -ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత పాటదని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ వెల్లడించారు..కరీంనగర్ ఆదివారం సీతారాంపుర్ పిఎం కన్వెన్షన్ లో తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాన్స్ స్పోర్ట్స్ వర్క్ షాప్ ప్రిపరేషన్ మీటింగ్ ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్… కళాకారులతో కలిసి తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం… డ్యాన్స్ ను కళగా కాకుండా… క్రీడగా గుర్తించిందని… డ్యాన్స్ స్పోర్ట్స్ కు తెలంగాణ ప్రభుత్వం సైతం సంపూర్ణ మద్దతునందిస్తుందన్నారు. ఇందుకోసం కరీంనగర్ లో డ్యాన్స్ అకాడమీ బిల్డింగ్ ను నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారు..

నేను కళాకారున్ని కాకపోయినా… కళలను పోషించడం నా నైజామన్నారు . ఇందుకోసం ఇప్పటికే కరీంనగర్ వేదికగా కళోత్సవాలను నిర్వహించమన్నారు. కరీంనగర్ అంటేనే కవులు… కళాకారులు… సాహితీ వేత్తలకు నిలయమని… స్వర్గీయ సినారే… స్వర్గీయ పీవి నర్సింహరావు పుట్టిన గడ్డ కరీంనగర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు… కళాకారుల పాత్ర మరువలేనిదని… తెలంగాణ ఉద్యమంలో పాటే ముందుండి ఉద్యమాన్ని నడిపించిందన్నారు.

. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అంటే కల్లోల జిల్లా అని… ఇక్కడికి… ఇతర ప్రాంతాల వారు వచ్చేందుకు భయపడేవారని… కానీ స్వయం పాలనలో… కరీంనగర్ వచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. ఇప్పటికే కరీంనగరం బ్రహ్మోత్సవాలు… కళోత్సవాలు… చిత్రోత్సవాలకు వేదికగా మారి… హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా అభివృద్ది చెందిందన్నారు. డ్యాన్స్ ను స్పోర్ట్ కింద అడాప్ట్ చేసిన ఘనత మా ప్రభుత్వానిదని… డ్యాన్స్ స్పోర్ట్ కు సంపూర్ణంగా మద్దతిస్తామన్నారు. కరీంనగర్ లో డ్యాన్స్ అకాడమీ భవనానికి వారం రోజుల్లో భూమిపూజ నిర్వహించుకుందామని హామి ఇచ్చారు.

- Advertisement -

ఇప్పటికే కేబుల్ బ్రిడ్జీ ప్రారంభించామన్నారు … 2 నెలల్లో మొదటి దశ మానేరు రివర్ ఫ్రంట్ ను ప్రారంభిస్తామన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే… కరీంనగర్ సినీమా షూటింగ్ లకు వేదికగా మారనుందన్నారు. కళాకారులు సైతం… కేబుల్ బ్రిడ్జీ మీద మీ సాంస్కృతి కార్యక్రమాలు చేపట్టి… కరీంనగర్ వాసులకు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. రన్నింగ్… స్విమ్మింగ్ కంటే డ్యాన్స్ తో మంచి ఎక్సర్ సైజ్ లభిస్తుందని… పిల్లలు విధిగా డ్యాన్స్ పై కూడా దృష్టిని సారించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు… ఇక్కడి యాసను… ఆంధ్రా ప్రాంతం వారు కేవలం రౌడీయిజానికి… హాస్యానికి వాడుకున్నారని… కానీ ఇప్పుడు తెలంగాణ యాస లేకుండా సినిమా నడిచే పరిస్థితి లేదన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కట్ట రమేష్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సతీష్ రెడ్డి సోమరాజు, వంగల శ్రీధర్ ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, లింగంపల్లి నాగరాజు గసికంటి జనార్దన్ రెడ్డి మెతుకు హేమలత పటేల్, కృపానందం తిప్పర్తి ప్రభు శ్రీరామోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement