Friday, May 3, 2024

విదుతలై తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్..

తమిళ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా “విడుదలై పార్ట్ 1”. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తెరక్కించాడు. ఈ సినిమాలో నటుడు, కమెడియన్ సూరి మెయిన్ లీడ్ లో నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. తమిళ నాట అద్భుత విజయం సాధించిన ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్నట్టు తెలిసిందే. కాగా, ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తించే విదంగానే ఉందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లో మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ వింటేజ్ మోడ్ లో సినిమాకి తగ్గట్టుగా ఆసక్తిగా ఉంది. ఓవరాల్ గా అయితే ఈ సినిమా ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉంది. కాగా, ఈ సినిమా తెలుగు డబ్ ఈ నెల (ఏప్రిల్) 15 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. మరి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement