Wednesday, May 1, 2024

అఖిల్‌ ఏజెంట్ నుంచి మూడో సింగిల్ “రామకృష్ణ” రిలీజ్ చేసిన మేక‌ర్స్

దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఈ సినిమాతో అఖిల్ భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంటాడ‌ని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాతో సాక్షి వైద్య తెలుగు అభిమానుల‌కు తొలిసారి ప‌రిచ‌యం కానుంది. ఇక‌, ఈ సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు మిగిలి ఉండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ ని వేగ‌వంతం చేశారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా సినిమా నంచి రామ కృష్ణ అనే మూడో సింగిల్‌ని ఇవ్వాల రిలీజ్ చేశారు మేక‌ర్స్.

అకాడమీ అవార్డ్ విజేత చంద్రబోస్ రాసిన ఈ పాటని, రామ్ మిర్యాల పాడాడు. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కంపోజ్ చేయగా.. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 28 న థేయేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement