Thursday, April 25, 2024

టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం.. సినిమా షూటింగ్ లకి బ్రేక్

టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్​స్టార్ కృష్ణ కన్నుమూయడంతో సినిమా షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం అధికారికంగా సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చారు. తన సోదరుడు రమేశ్‌బాబుని పోగొట్టుకున్న బాధలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కోలుకునేలోపే ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపు తండ్రి కృష్ణ మరణం ఆయన్ను మళ్లీ విషాదంలోకి నెట్టేసింది. ఈ కష్టకాలంలో మహేశ్‌కు శక్తినివ్వాలంటూ అభిమానులు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement