Monday, April 29, 2024

90 వసంతాల భార‌త‌ వైమానిక దళం… ఎయిర్ ఫోర్స్ లో కొత్త విభాగం..

భార‌త వైమానిక ద‌ళం 90వ వార్సికోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వివేక్ రామ్ చౌద‌రీ పాల్గొన్నారు. ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన సంద‌ర్భ‌మ‌ని, వైమానిక ద‌ళంలో ఆఫీస‌ర్ల రిక్రూట్మెంట్ కోసం వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ వెల్ల‌డించారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఐఏఎఫ్‌లో ఆప‌రేష‌న్ బ్రాంచ్‌ను క్రియేట్ చేయ‌డం ఇదే తొలిసారి అని ఆయ‌న అన్నారు. వెప‌న్ సిస్ట‌మ్ శాఖ వ‌ల్ల ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ కోసం అయ్యే ఖ‌ర్చుల్లో సుమారు 3400 కోట్ల‌ను ఆదా చేయ‌వ‌చ్చు అని చౌద‌రీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో 3వేల మంది అగ్నివీరుల‌కు వాయు సేన కోసం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సంఖ్య‌ను మునుముందు పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది నుంచి మ‌హిళా అగ్నివీరుల్ని ర్రికూట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్న‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. దీని కోసం మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో నిమ‌గ్న‌మైన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 90వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భార‌త వైమానిక ద‌ళం ఇవాళ త‌మ ద‌ళం కోసం కొత్త యూనిఫామ్‌ను ఆవిష్క‌రించింది.

భారత రక్షణ వ్యవస్థలో మూడు దళాలు ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్. దేశ రక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళం(Air Force) బ్రిటీష్‌ కాలంలో 1932 అక్టోబరు 8న ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొని పోరాటం చేసింది. స్వాతంత్రం అవతరించిన అనంతరం భారత వైమానిక దళం(Indian Air Force) గా మారింది. మొత్తం 1.70 లక్షల మంది సిబ్బంది, 1300పైగా యుద్ధ విమానాలతో ప్రపంచంలోనే నాలుగో పెద్ద వైమానిక దళంగా గుర్తింపు పొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement