Tuesday, May 14, 2024

పై పైకి వస్తున్న పాతాళ గంగ.. సగటున 6 మీ. లోతులో నీరు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా కురిసిన వర్షాలతో భాగర్భంలో సుమారు 650 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చినట్లు నీటిపారుదల శాఖ అంచనావేసింది. గతంలో కంటే అత్యధికంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వందలాది చెరువులు మత్తడి దూకుతుండటంతో పాటు బోర్లలో భూగర్భ జలాలు పొొంగివస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంవృద్ధిగా కురుసిన వర్షాలతో కాళేశ్వరం తో పాటు 47 జలాశయాలు, వేలాది చెరువుల్లో నీరు తొణికిస లాడుతోంది.

ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పాతళ గంగ పైపైకి ఎగిసి వస్తోండటంతో సర్వత్రా ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే భూగర్భ నీటి నాణ్యత, భూగర్భంలో ఎంతమేరకు నీరు విస్తరించి ఉందో శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు సంచార నీటి నాణ్యత ప్రయోగ శాల వాహనాన్ని ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధనలు ప్రారంభించింది. ఈ వాహనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1600 శాంపిల్స్‌ సేకరించి అధ్యయనం చేయనుంది.

ప్రాథమిక సమాచారం మేరకు మెదక్‌ లో సుమారు 15 మీటర్ల లోతులోంచి 11 మీటర్ల వరకు పైకివచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో కేవలం 5మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 7మీటర్లలోతులో నీరు పొంగిపొరలుతున్నట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం,మిషన్‌ కాకతీయకు ముందు సుమారు 15నుంచి 20 మీటర్ల లోతు లో కొద్దిపాటి నీటి ఊటలున్న ప్రాంతాల్లో ప్రస్తుతం 2నుంచి 3 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి.

ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లోని అనేకబోరు బావుల నీటి పరిశోధనలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ తగ్గినట్లు శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఉపరితలంలో నీటి నిల్వలు పెరగడం. జలాశయాల నిర్మాణాలతో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ తగ్గినట్లు సమాచారం. అలాగే మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత తాగునీరు లభించడంతో ఫ్లోరైడ్‌ తగ్గినట్లు శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీరు భూ ఉపరితలాల్లో ప్రవహిస్తే భూగర్భంలో ఫ్లోరైడ్‌ సమసిపోనున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. భారీ వర్షాలతో భూగర్భజలాలపెంపు గణనీయంగా పెరగడం, భూఉపరితల నీరు వినియోగంలోకి రావడంతో క్రమేణ బోరుబావులపై ఆధారపడిన వ్యవసాయం కూడా తగ్గుతోందని అధికార యంత్రాంగం అంచనావేసింది. అయితే భూగర్భంలో చేరిన నీరు కృష్ణా జలాల్లోని తెలంగాణ వాటాకు రెండింతలు మించి ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement