Tuesday, June 18, 2024

Rian Effect: రోడ్డునపడ్డ కుటుంబాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు

బాల్కొండ, (ప్రభ న్యూస్) : తెలంగాణ‌లో వారం, పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప‌ల్లెలు, ఊళ్ల‌ను వ‌ర‌ద నీరు ముంచెత్తుతోంది. వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. నివాసగృహాలు నీట మున‌గ‌డంతో పేద‌ల‌ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తలదాచుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ప్ర‌భుత్ం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు వారిని త‌ర‌లించి అధికారులు ప్ర‌త్యేక‌ ఏర్పాట్లను చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నివాసగృహాలు నేలమట్టమయ్యాయి. దీంతో నిరాశ్రయులైన కుటుంబాలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement