Sunday, February 25, 2024

ముచ్చ‌ట‌గా మూడోసారి – త్రివిక్ర‌మ్ తో మ‌హేశ్ బాబు

అత‌డు..ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌రోసారి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ..హీరో మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో మ‌రో మూవీ రానుంది. ఈ రెండు చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా అంత‌గా స‌క్సెస్ సాధించ‌కోపోయినా బుల్లితెర‌పై మాత్రం ఘ‌న విజ‌యం సాధించాయి దాదాపు 12ఏళ్ళ తర్వాత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్..సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు వీరిద్ద‌రూ క‌లిసి హ్య‌ట్రిక్‌కు రెడీ అవుతున్నారు. ఫిబ్ర‌వ‌రిలోనే లాంఛనింగ్ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు.

తాజాగా మేక‌ర్స్ షూటింగ్ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.ఇటీవ‌లే త్రివిక్ర‌మ్, మ‌హేష్‌కు ఫుల్ స్క్రిప్ట్‌ను వినిపించార‌ట‌. కాగా తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌య చేయ‌బోతున్న‌ట్లు కూడా గ్లింప్స్‌లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాస‌ని క్రియేష‌న్స్ ప‌తాకంపై చిన‌బాబు నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement