Sunday, April 28, 2024

‘బిచ్చ‌గాడు 2’ డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌

కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు, సంగీత దర్శకుడు, ఇప్పుడు దర్శకుడు అయినటువంటి విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బిచ్చగాడు 2”. గతంలో వచ్చిన “బిచ్చగాడు” సినిమా తెలుగు సహా తమిళ్ లో అద్బుత‌మైన‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో పార్ట్ 2 ని స్వయంగా విజయ్ ఆంటోనీ నే టేకప్ చేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. కాగా ఇవ్వాల తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో ఈ మైవీ రిలీజ్ అయ్యింది.

అయితే, ఈ మూవీ తాలుకా ఓటిటి హక్కులపై లేటెస్ట్ అప్డేట్ వ‌చ్చింది. ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన‌ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ట్టు తెల‌స్తోంది. కాగా, ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement