Wednesday, May 1, 2024

Breaking | రంగారెడ్డి జిల్లాలో ఇంట‌ర్ స్టూడెంట్‌ మృతి.. ప్ర‌మాద‌మా, ఆత్మ‌హ‌త్యా?

రంగారెడ్డి జిల్లా హాయత్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్న 17 ఏళ్ల ఇంట‌ర్ స్టూడెంట్‌ హాస్టల్ బిల్డింగ్ మీది నుంచి కింద‌ పడి చ‌నిపోయింది. మృతురాలు భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంకగా గుర్తించారు పోలీసులు. ఆమె హయత్‌నగర్, ప్రగతినగర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ నీట్ కోచింగ్ తీసుకుంటోంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ప్రియాంక తన హాస్టల్ బిల్డింగ్ టెర్రస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement