Tuesday, May 21, 2024

Delhi | ఖర్చు లెక్కలు, అన్నీ తప్పులతడకలే.. ఎన్నికల సంఘానికి న్యాయవాదుల ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆదాయ వ్యయాలను నిశితంగా గమనించాలని సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు దాఖలు చేసిన తాజా అఫిడవిట్లను గత అఫిడవిట్లతో పోల్చి ఐదేళ్ల కాలంలో పెరిగిన ఆదాయం, వనరులు, సక్రమమార్గాల్లో వచ్చిన ఆదాయమా లేక అక్రమంగా సంపాదించారా అన్నది గమనించాలని కోరుతూ ఓ లేఖ రాశారు.

- Advertisement -

న్యాయవాది యు. జగన్‌తో పాటు మరికొందరు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ ఫిర్యాదు లేఖను అందజేశారు. ఎన్నికల నియమావళి మేరకు ఏ అభ్యర్థి కూడా గరిష్ట పరిమితికి లోబడి ఖర్చు చేయడం లేదని, అన్నీ తప్పుడు లెక్కలే చూపుతున్నారని వారు ఆరోపించారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారని కూడా వెల్లడించారు. డబ్బు, మద్యం పంపిణీ సర్వసాధారణంగా మారిపోయిందని, సరైన నిఘా, పర్యవేక్షణ ఉండడం లేదని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఈసీ నియమించే అధికారులు నిఘా పెట్టి కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఓట్ల కోసం అభ్యర్థులు ప్రకటనలిచ్చే పత్రికలు, టీవీ ఛానెళ్లలోనే తమపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి కూడా ప్రకటనలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. అభ్యర్థి ఆదాయ ధృవీకరణపై లోతుగా, నిశితంగా అధ్యయనం చేయాలని లేఖలో కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement