Thursday, May 2, 2024

ఆక‌ట్టుకుంటోన్న బింబిసార మేకింగ్ వీడియో

హీరో క‌ల్యాణ్ రామ్ న‌టించి నిర్మించిన చిత్రం బింబిసార‌. ఈ చిత్రాన్ని వ‌శిష్ఠ తెర‌కెక్కించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడించింది. వేరు వేరు కాలాలకు సంబంధించిన కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించడంలో వశిష్ఠ సక్సెస్ అయ్యారు. మొదటి సినిమానే ఈ స్థాయిలో తీశారంటే ఈ తరహా సినిమాలను మున్ముందు మరో రేంజ్ లో చేయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా కోసం జరుగుతున్న సెట్ నిర్మాణం .. డాన్సులు .. ఫైట్లు కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ పై మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ఈ నెల 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం హిట్ట్ గా నిలిచింది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement