Thursday, May 2, 2024

పసుపు బోర్డుకి ఛాన్సే లేదు…ధర్మపురి ఏం చేస్తారు ?

ఎన్నికలకు ముందు నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేకపోతే రాజీనామా చేస్తానని కూడా బాండ్ పేపర్ రాసిచ్చాడు. అయితే అలాంటిది ఏర్పాటు చేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పసుపు బోర్డు పెట్టె ఉద్దేశ్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించింది. తెరాస ఎంపీ సురేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా ఆయనకు సమాధానాన్ని ఇచ్చారు.

సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఆయన లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. కాగా ఎన్నికల ముందు పసుపు బోర్డ్ సాధిస్తామన్న ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు రాజీనామా చేస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement