Wednesday, May 15, 2024

అంతరిక్షంలో అతిపెద్ద గ్రహం.. జ్యూపిట‌ర్ కంటే 12 రెట్లు పెద్దది..

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ భారీ గ్రహాన్ని కనుగొన్నది. సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఆ గ్రహం బృహస్పతి (జ్యూపిట‌ర్) కన్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్యవస్థ అవతల ఉన్న కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్‌ సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. అయితే ఈ కొత్త గ్రహాన్ని నాలుగు రకాల లైట్‌ ఫిల్టర్లలో పరీక్షించారు. చాలా శక్తివంతంగా ఈ గ్రహం వెలిగిపోతోంది. సోలార్‌ సిస్టమ్‌ బయట ఎలా ఓ విశిష్ట ప్రదేశం ఉందో ఈ గ్రహాన్ని వీక్షిస్తే తెలుస్తుందన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కనుగొన్న గ్రహాన్ని హెచ్‌ఐపీ 65426బీగా నామకరణం చేశారు. ఇది జూపిటర్‌ గ్రహం కన్నా సుమారు 12 రెట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఆ గ్రహం ఏర్పడి దాదాపు 15 నుంచి 20 మిలియన్ల సంవత్సరాలు అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాసా తన బ్లాగ్‌లో కొత్త ప్లానెట్‌కు సంబంధించిన చిత్రాలను రిలీజ్‌ చేసింది. వాస్తవానికి ఈ గ్రహాన్ని 2017లో తొలిసారి గుర్తించారు. కానీ దానికి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు వెబ్స్‌ టెలిస్కోప్‌తో ఆ ప్లానెట్‌కు చెందిన కొత్త వివరాలను సేకరించారు. జేమ్స్‌ వెబ్‌ కెమెరాలో ఉన్న నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాకు ఈ కొత్త ప్లానెట్‌ చిక్కింది. అయితే అత్యంత దూరం నుంచి కూడా ఆ కెమెరా గ్రహాన్ని గుర్తించింది. మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ కూడా కీలక వ్యవ#హరించింది. ఈ దశాబ్ధం చివరలో ప్రయోగించనున్న నాన్సీ గ్రేస్‌ రోమన్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఆ గ్రహానికి చెందిన మరిన్ని కరోనాగ్రాఫ్‌ వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు నాసా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement