Friday, November 8, 2024

అనారోగ్యంతో అర్జున్ కుమార్ తండ్రి.. ఆదుకున్న అల్లు అర్జున్

అర్జున్ కుమార్ ఈయ‌న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి డైహార్ట్ ఫ్యాన్.ఈ విష‌యం బ‌న్నీకి కూడా తెలుసు.అయితే గ‌త కొంత కాలంగా అర్జున్ కుమార్ తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ కు రెండు లక్షలకు పైగా అవసరమైంది. అంత స్థోమతలేకపోవడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషయాన్ని తెలియజేస్తూ దాతల నుంచి సాయం కోరారు. ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడుకు తెలియడంతో బన్నీకి వివరించారు. అయితే, అప్పటికే బన్నీకి అర్జున్ కుమార్ తెలియడంతో వెంటనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీనిచ్చారు. వెంటనే ఆ డబ్బును కూడా పంపించి అభిమానిని ఆదుకున్నారు. దీంతో అర్జున్ కుమార్ బన్నీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement