Sunday, April 28, 2024

గాల్లో ‘వకీల్ సాబ్’.. తమన్ ఎమన్నాడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. మూవీలోని సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. తాజాగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన విమాన ప్రయాణంలో గాలిలో సాగుతోందని తమన్ తెలిపాడు. 37,000 అడుగుల ఎత్తులో ‘వకీల్ సాబ్‌’ను చూస్తున్న ఒక చిన్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 న విడుదల అవుతాయని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement