Saturday, April 20, 2024

Movie: అవ‌కాశాలొస్తున్న‌య్‌.. కానీ, యాక్టింగ్‌పై ఇంట్ర‌స్ట్ లేదు..

తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్‌లో బ్యూటీఫుల్ క‌థానాయిక‌ల్లో చార్మీ ఒక‌రు. చాలా వేగంగా ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లింది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది. ఆ త‌ర్వాత‌ ఆమె నటనను పక్కన పెట్టేసి, పూరి నిర్మాణంలో భాగస్వామిగా ఉంటోంది.

తాజా ఇంటార్వ్యులో చార్మీ మాట్లాడుతూ .. “హీరోయిన్ గా ఉండటంలోనే ఎక్కవ కంఫర్ట్ ఉంటుంది.. ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెడితే సరిపోతుంది. నిర్మాతగా బాధ్యతలను స్వీకరించడం మాత్రం అంత తేలికైన విషయమేం కాదు. అప్పుడు అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది. అన్నారు.

హీరోయిన్ గా ఉన్నప్పుడు నా పని వరకూ నేను చూసుకుంటే సరిపోయేది. కానీ నిర్మాతగా మారిన తరువాత అలా కుదరదు. గాడిద చాకిరీ చేయవలసి వస్తోంది. అలా అని చెప్పేసి నాకేమీ విసుగు అనిపించడం లేదు. నటిగా నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే ఆలోచన మాత్రం లేదు” అని చెప్పుకొచ్చింది అమ్మ‌డు.

Advertisement

తాజా వార్తలు

Advertisement