Monday, May 20, 2024

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 6.. ఆ 10 మంది కంటెస్టెంట్స్ వీరేనా!?

అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ టీవీ షో మరోసారి ప్ర‌సారానికి రెడీ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం ప్ర‌చారంలో ఉన్న కొంత‌మంది పోటీదారుల లిస్ట్ ఇక్కడ ఉంది. అయితే ఇందులో చివ‌రివ‌ర‌కు ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు ఉండ‌ర‌నేది మాత్రం స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు.

పోటీదారులు..

1) శ్రీహన్- నటుడు, దర్శకుడు, సింగ‌ర్‌.

2) నందు- నందు ప్రముఖ నటుడు, సింగ‌ర్‌ గీతా మాధురి భ‌ర్త‌.

3) నేహా చౌదరి- నేహా స్టార్ స్పోర్ట్స్‌కి ప్రసిద్ధ యాంకర్. ఐపిఎల్, ఐసిసి ప్రపంచ కప్ మొదలైన అనేక ఈవెంట్‌లను నిర్వహించారు.

- Advertisement -

4) RJ సూర్య- ప్రముఖ రేడియో జాకీ. తన మిమిక్రీ నైపుణ్యంతో అంద‌రినీ అల‌రిస్తాడు.

5) చలాకీ చంటి- జబర్దస్త్ నుండి ఈ జాబితాలో కనిపించిన అనేక మంది పోటీదారులలో చలాకీ చంటి ఒకరు.

6) జబర్దస్త్ తన్మయ్- జబర్దస్త్ తన్మయ్ కూడా ఈ సీజన్ బిగ్ బాస్‌లో భాగమే.

7) జబర్దస్త్ అప్పారావు- జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ షోలో ఫేమ‌స్ కారెక్ట‌ర్‌

8) ఉదయ భాను- యాంక‌ర్ గా అంద‌రికీ ప‌రిచ‌మే. సుమ తర్వాత ఈమెకున్న పాపులారిటీ మ‌రెవ‌రికీ లేదు.

9) సుదీప పింకీ- నువ్వు నాకు నచ్చావ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుదీప పింకీ

10) ఆది రెడ్డి- ఫాంటసీ క్రికెట్ ఆడుతూ తన ఛానెల్‌లో బిగ్ బాస్‌ని సమీక్షించే యూట్యూబర్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement