Friday, April 19, 2024

తెలంగాణ తదుపరి సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న సర్వే

తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే హస్తం నేతలు కూడా ఓ సర్వే చేయించారట. ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 54 సీట్లు వస్తాయని, టీఆర్ఎస్ పార్టీకి 14 నుంచి 16 సీట్లు వస్తాయని స్పష్టమైందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీకి 43 నుంచి 47 సీట్లు వస్తాయట. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఈ సర్వే చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సర్వేలో టీఆర్ఎస్ పనితీరు బాగుందని 19.9 శాతం మంది చెప్పగా.. ఫర్వాలేదని 38.1 శాతం మంది, బాగోలేదని 39.8 శాతం మంది చెప్పారట. మరోవైపు సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని 21.4 శాతం మంది, ఫర్వాలేదని 33.3 శాతం మంది, బాగోలేదని 43.4 శాతం చెప్పినట్లు సర్వేలో స్పష్టమైందట. ఇక ఓటింగ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 37.8 శాతం ఓట్లు, బీజేపీకి 31.4 శాతం ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 13.5 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందని చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎంగా రేవంత్‌రెడ్డికి మంచి అవకాశం ఉంటుందని సర్వేలో తేలినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాగా ఈ సర్వేను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement