Friday, March 29, 2024

ట్విట్టర్ లో కేటీఆర్ కు అరుదైన రికార్డ్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులపై ఎప్పటికప్పుడు ప్రజలకు తన ట్విట్ల ద్వారా వెల్లడిస్తుంటారు. తాజాగా ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు 30 ల‌క్ష‌ల‌కు చేరింది. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ వెల్లడించారు. కేటీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలుపుతూ అభినందల వ‌ర్షం కురిపించారు. ఏడాది కాలంలోనే కేటీఆర్ 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement