Tuesday, April 30, 2024

తెలంగాణ కొత్తగా 1061 కరోనా కేసులు…లేటెస్ట్ అప్డేట్

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 11 మంది కొత్తగా మృతి చెందారు. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 6,18,837కి చేరింది. అలాగే 5,99,695 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అలాగే యాక్టీవ్ కేసులు 15,524 ఉన్నాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 3618కి చేరుకుంది.

అయితే కొత్తగా నమోదు అయిన కేసుల్లో గ్రేటర్ లో అత్యధికంగా 135 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 80, సూర్యాపేట జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 66, నల్గొండ జిల్లాలో 65 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement