Monday, May 6, 2024

కరోనా పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో కరోనా కేసులు ఉదృతి పై ఆందోళన నెలకొంది రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో వారికి చికిత్స అందించడంపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో DM అండ్ HO ల టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఆ పైన బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1691 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అందులో 41 వేల బెడ్స్… ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్స్ 10వేలు కాగా. 5వేల ICU బెడ్స్, 1500 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తేల్చారు. ఇక DM అండ్ HO లకు అనుమతిస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరగనున్నాయని ప్రమాద హెచ్చరికలు రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement