Friday, April 26, 2024

ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులు విస్తృత, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులను మాత్రమే చేర్చుకోవాలని పేర్కొంది. ప్రత్యేకంగా ఆక్సిజన్ అమర్చాల్సిన అవసరంలేని 94 శాతానికి కేసులకు హోం ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలకు సిఫారసు చేయాలని సూచించింది.

ముఖ్యంగా విస్తృత, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే చేర్చుకోవాలని, కోవిడ్ టెస్టు నివేదిక కోసం వారిపై ఒత్తిడి చేయరాదని ఆదేశించింది. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రవేశ ద్వారం వద్దే సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుండాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement