Friday, May 10, 2024

తెలంగాణ సీజే ప్రమాణస్వీకారం.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే రేపు ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్​ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఆదివారం ఉదయం 11:00 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తిగా ఆరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి వీవీ జంక్షన్ వరకు రాజ్ భవన్ రహదారిలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

VV విగ్రహం – మోనప్ప జంక్షన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్ వ‌చ్చే వాహ‌న‌దారులు పంజాగుట్ట – గ్రీన్‌ల్యాండ్స్ , పంజాగుట్ట నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ – షాదన్ నిరంకారి వైపు వెళ్లాల్సి ఉంటుంది.

- Advertisement -

పంజాగుట్ట రోడ్ – రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ (మెట్రో రెసిడెన్సీ) నుండి ఇరువైపులా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement