Saturday, May 18, 2024

ఈడీ చీఫ్​గా బండి సంజయ్​ను ఎప్పుడు చేశారు?.. మోడీ, ఈడీ దేశాన్ని నడిపించే డబుల్​ ఇంజిన్​?

ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెదిరింపులతో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. బండి ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు శుక్రవారం ట్విట్టర్‌లో సీరియస్​​ అయ్యారు. ఈడీ చీఫ్‌గా బండి సంజయ్ కుమార్‌ను నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ దేశాన్ని నడిపించే డబుల్ ఇంజిన్ వాస్తవానికి మోడీ & ఈడీ అని ఇప్పుడు మేము గ్రహించాము” అని కేటీఆర్​ తన ట్విట్టర్​లో  సెటైర్​  వేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈడీని ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ గురువారం అన్నారు. సోనియాగాంధీని ప్రశ్నిస్తున్న ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎందుకు నిరసనలు చేస్తోందని విస్మయం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ ఇంకెన్నాళ్లైనా ఈడీ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి అన్నారు. అందుకే సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలకు ఆయన మద్దతిస్తున్నారు అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆరోపణలు వచ్చినప్పుడు వారు అన్ని విచారణలను ఎదుర్కొని క్లీన్‌గా బయటపడ్డారని బండి సంజయ్​ చెప్పారు.

కేసీఆర్ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలు నిఘా ఉంచాయని, త్వరలో ఆయన కూడబెట్టిన ఆస్తులపై విచారణ ప్రారంభిస్తామని బండి సంజయ్ గతంలో చెప్పారు. ‘అందుకే కేసీఆర్, ఆయన కొడుకు, మేనల్లుడు తమను కటకటాల వెనక్కి నెట్టివేస్తారని బాగా తెలిసి ఎన్నడూ లేనంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు’ అని టీఆర్‌ఎస్ అధినేత వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలతో చర్చలు జరుపుతున్న సందర్భంగా సంజయ్ కామెంట్స్​ చేశారు. కాగా, ఈ సందర్బంగా కేసీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని నడ్డా విమర్శించారు. జులై 3న హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన సందర్భంగా షా, నడ్డా ఇద్దరూ కేసీఆర్ అవినీతి, కేంద్ర నిధుల మళ్లింపుపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అయితే.. కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాష్ట్ర అధికార పక్షం ఆరోపణలను కొట్టిపారేసింది. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు పలువురు కేంద్ర మంత్రులు సమాధానమిస్తూ ప్రాజెక్టుల్లో అవినీతి లేదని పార్లమెంట్‌లోనే చెప్పారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement