Saturday, July 27, 2024

టూరిజం హ‌బ్‌గా తెలంగాణ‌ : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా

హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర కేఎన్ ఆర్ సైక్లింగ్ ఈవెంట్స్ కె.నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన సైక్లింగ్ రైడ్ చార్మినార్ టు వరంగల్ ఫోర్ట్ హిస్టారికల్ రైడ్ 150 కి.మీను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. అనంత‌రం జెండా ఊపి సైక్లింగ్ రైడ్ ను ప్రారంభించారు. ఈ సైక్లింగ్ రైడ్ కార్యక్రమంలో 55 మంది సైక్లిస్టు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అన్ని రంగాలతో పాటు తెలంగాణ టూరిజం రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తెలంగాణలో టూరిజం రంగాన్ని ఒక హబ్ లాగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అన్నిటినీ సైక్లింగ్ ద్వారా కలియ తిరిగి చూసి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన కోట్లాది మొక్కల గురించి, తెలంగాణ టూరిజం గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పాలని అన్నారు. ప్రతి ఒక్కరు రైడ్ లో హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లో హెల్మెట్ లేకుంటే జరిగే ప్రమాదాలను నివారణకు కృషి చేయాలని కోరారు. యువత చెడు అలవాట్లకు గురి కావొద్దని, పెడదోవ పట్టకుండా మంచి అలవాట్లతో క్రమశిక్షణ కలిగి ఉండాలని, జీవితంలో మంచి లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి ఎస్.రవి, హీరో & డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్, సైక్లిస్టు రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement