Sunday, December 3, 2023

ఏపీలో పొత్తులు ఖరారు కాలేదు : జనసేన నాయకుడు నాగబాబు

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల విషయం ఇంకా ఖరారు కాలేదని జనసేన నేత పీఏసీ సభ్యులు నాగబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ నేతల ర్యాలీలు సమావేశాలను ఆందోళన అడ్డుకునే విధంగా ఇచ్చిన జీవో వన్ పై ఆయన స్పందించారు. కోర్టు మొట్టికాయలు వేసింది కదా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంచి పనులు చేసేందుకు ఏ నిబంధనలైనా అడ్డుకోలేవని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు ఎలా ఉన్నాయో పాలన కూడా అలాగే జరుగుతుందని ఘాటుగా విమర్శించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను జనసేన సైనికులుగా మేమే బాగు చేస్తామని చెప్పారు. జనసైనికులతో, వీర మహిళలతో సమావేశం అయ్యేందుకు ఆయన రెండు రోజుల పర్యటనలో ఆదివారం భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నగరంలోని చెరువు కట్ట పైకి వచ్చి అక్కడ అధ్వానంగా ఉన్న రహదారులను చూశారు. తమ పర్యటన సందర్భంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, అన్నారు. అంతకుమునుపు స్థానికంగా జనసేన కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. వీర మహిళలకు సన్మానం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement