Monday, April 29, 2024

టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ 5882కోట్ల పెట్టుబడి..

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ను ఢీకొట్టేందుకు దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఈ-కామర్స్‌ కంపెనీ టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ రూ.5,882కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ-కామర్స్‌లో టాటా గ్రూప్‌ ఇంత భారీస్థాయిలో పెట్టుబడి పెట్టడం ఇదే ప్రథమం. ఈక్రమంలో టాటా డిజిటల్‌లో మొత్తం పెట్టుబడులు 2021-22లో రూ.11,872కోట్లుకు చేరింది. కాగా మార్చి 30న సమావేశమైన టాటా డిజిటల్‌ బోర్డు టాటా సన్స్‌కు రూ.10 ముఖ విలువ కలిగిన 5.88 బిలియన్ల పుల్లి పెయిడ్‌ అప్‌ ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

టాటా గ్రూప్‌ ఎలక్ట్రానిక్‌ రిటైల్‌ చైన్‌ క్రోమాలోనూ హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా రూ.5990కోట్లు పెట్టుబడి పెట్టింది. భారత్‌లో ఈ-కామర్స్‌ ద్వారా డిజిటల్‌ ఎకానమీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఈనేపథ్యంలో ఈ-కామర్స్‌ రంగంలో రాణించేందుకు టాటా గ్రూప్‌ ఏప్రిల్‌ 7న టాటా న్యూ పేరిట సూపర్‌ యాప్‌ను కూడా విడుదల చేసింది. దీనిద్వారా ఎయిరేషియా, బిగ్‌బాస్కెట్‌, క్రోమా, ఐహెచ్‌సీఎల్‌, క్యూమిన్‌, స్టార్‌బక్స్‌, టాటా 1ఎంజీ, టాటా ప్లేతోపాటు పలు సేవలు ఒకే వేదికపై వినియోగదారులుకు అందుబాటులోకి రానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement