Monday, April 29, 2024

ఆపిల్‌ ఐఫోన్‌ 15, 15 ప్లస్ తయారీకి టాటా గ్రూప్‌రెడీ

భారతదేశంలో ఆపిల్‌ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని చూస్తున్నందున, 2023 ఐఫోన్‌ సిరీస్‌ ఫోన్‌లలో రెండు ఇక్కడే తయారు చేయబడతాయని ఒక నివేదిక సూచిస్తుంది. ట్రెండ్‌ఫోర్స్‌ ప్రకారం, కుపెర్టినో ఆధారిత కంపెనీ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌లను భారతదేశంలో తయారు చేసే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్‌లను టాటా గ్రూప్‌ అసెంబ్లింగ్‌ చేయనుంది. ”భౌగోళిక రాజకీయాలు, మహమ్మారి కారణంగా, ఆపిల్‌ తన సరఫరా వనరుల వైవిధ్యాన్ని వేగవంతం చేస్తోంది.

- Advertisement -

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ నిలిచింది. టాటా గ్రూప్‌ ఆపిల్‌ కోసం నాల్గవ ఐఫోన్‌ అసెంబ్లర్‌గా అవతరించనుందని అంచనా వేయబడింని ఈ నివేదిక పేర్కొంది. ప్రారంభంలో, టాటా గ్రూప్‌ చిన్న ఆర్డర్‌లను స్వీకరిస్తుంది. అంటే కంపెనీ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ల కోసం చిన్న ఆర్డర్‌లను మాత్రమే పొందుతుంది. ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ వ్యాపారంలోకి టాటా ప్రవేశించడం అంటే విస్ట్రాన్‌ దేశం నుండి నిష్క్రమించడమే.. టాటా గ్రూప్‌ ఇప్పటికే బెంగళూరులో విస్ట్రాన్‌ ఐఫోన్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement