Sunday, May 5, 2024

టాట్ ప‌బ్ పై స్థానికుల ఆందోళ‌న

శ‌ని,ఆదివారాలు వ‌చ్చాయంటే చాలు ప‌బ్ ల వారికి పండ‌గ‌నే చెప్పాలి. అంద‌మైన భామ‌ల‌తో క‌ళ క‌ళ‌లాడుతుంటాయి. ఈ మేర‌కు సౌండ్స్ కూడా అదిరిపోతుంటాయి. అయితే జ‌నాల మ‌ధ్య‌లో ఉన్న ప‌బ్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందికి గుర‌వుతున్నారు. దాంతో జూబ్లీహిల్స్ వాసులు ఆందోళ‌న చేశారు. జూబ్లీహిల్స్ లోని టాట్ పబ్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని… అందువల్లే తాము పబ్ ముందు ఆందోళనకు దిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

రాత్రిళ్ళు రెండు మూడు వరకు పబ్ లో మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన తీవ్ర సమస్యగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. గతంలో టాట్ పబ్ లో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలతో పాటు పలు కేసులు వున్నట్లు స్థానికులు గుర్తుచేసారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేసారు. వెంటనే పబ్ ను ఇక్కడి నుండి తీసివేయాలని స్థానికులు ఆందోళన చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా పోలీసులు ప‌ట్టించుకొని ప‌బ్ ని తీసివేస్తారేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement